సినిమా అనేది ఉద్యోగం కాదు.. ఒక లైఫ్ స్టైల్: రానా

  • సినిమా అనేది ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చే ఉద్యోగం కాదన్న రానా
  • ఇండస్ట్రీ అనేది వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీ కాదని వ్యాఖ్య
  • వరుసగా 15 గంటలు పని చేసినా ఆశించిన స్థాయిలో సీన్ రాకపోవచ్చన్న రానా

టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా ఒకవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ, మరోవైపు నిర్మాతగా కూడా క్రేజీ ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తూ చిత్ర పరిశ్రమలో తన ప్రత్యేక ముద్రను చాటుకుంటున్నారు. ఇటీవల ‘కాంత’ అనే డిఫరెంట్ కంటెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా, నటుడిగా మంచి మార్కులు కొట్టేసినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయారు.


మరోవైపు, చలనచిత్ర పరిశ్రమ పనితీరు, షూటింగ్స్ సమయంలో పడే కష్టం గురించి రానా చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. "సినిమా అనేది కేవలం ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చే ఉద్యోగం లాంటిది కాదు, అది ఒక లైఫ్‌స్టైల్. ఆ జీవనశైలిలో మీరు కొనసాగాలా వద్దా అనేది పూర్తిగా మీ ఇష్టంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రతి సినిమా కూడా మేకర్స్ నుంచి, నటీనటుల నుంచి ఇంకేదో ఒక కొత్త విషయాన్ని ఆశిస్తూనే ఉంటుంది. కేవలం ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తే ఒక అత్యుత్తమమైన సన్నివేశం వచ్చేస్తుందని అనుకోవడానికి ఇదేమీ వస్తువులను తయారుచేసే ఫ్యాక్టరీ కాదు" అని రానా స్పష్టం చేశారు.


సినిమా మేకింగ్ వెనుక ఉండే అంకితభావాన్ని వివరిస్తూ.. "కొన్నిసార్లు మనం సెట్స్‌పై వరుసగా 15 గంటల పాటు ఎంతో కష్టపడి షూటింగ్ చేసినా కూడా, ఆశించిన స్థాయిలో ఒక్క మంచి సీన్ కూడా రాకపోవచ్చు. సినిమా అనేది పూర్తిగా మనం చేసే ప్రాజెక్ట్‌ను బట్టి, అందులోని సిచ్యుయేషన్లను బట్టి మారుతూ ఉంటుంది" అని రానా చెప్పుకొచ్చారు. కేవలం గంటల లెక్కన కాకుండా, క్రియేటివిటీ కోసం ఎంతటి శ్రమనైనా ఓర్చడమే సినిమా రంగం ప్రత్యేకత అని ఆయన విశ్లేషించారు.

Rana Daggubati
Tollywood
Telugu cinema
Kantata
movie making
film industry
acting
film production
Indian cinema
movie lifestyle

More Telugu News